Gopichand: 'రామబాణం' నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది: డైరెక్టర్ శ్రీవాస్

  • శ్రీవాస్ నుంచి వస్తున్న 'రామబాణం'
  • గోపీచంద్ తో చేసిన మూడో సినిమా ఇది 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేసిన శ్రీవాస్ 
  • మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా  
Ramabanam Trailer Launch Event

గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన 'రామబాణం' మే 5వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును రాజమండ్రిలో నిర్వహించారు. 

ఈ వేదికపై శ్రీవాస్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో గోపీచంద్ - జగపతిబాబు అన్నదమ్ములుగా నటించారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా వాళ్లిద్దరూ నిజమైన అన్నదమ్ములా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాము" అని అన్నారు. 

"ఈ సినిమా 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలకి మించి ఉంటుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఏది చూసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోపీచంద్ ఫ్యాన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మే 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది .. అందరూ కూడా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News