nara lokesh: మేం ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ జగన్: లోకేశ్ వ్యాఖ్య

Nara Lokesh says government is not completing works
  • వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏ పనులు చేపట్టలేదన్న లోకేశ్ 
  • మైనార్టీలపై జగన్ వివక్ష అంటూ ఆగ్రహం
  • ఆరేకల్లులో మైనార్టీ ఉర్దూ ఐటీఐ కాలేజీ పూర్తి చేయలేదని విమర్శ
వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఏ పనులు చేపట్టడం లేదని, గతంలో ప్రారంభించిన పనులను అయినా పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన పాదయాత్రలో ఆయన అధికార పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా గురువారం విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వానికి కొత్తగా పనులు చేపట్టడం ఎలాగూ చేతకాదని, అలాగని గతంలో ప్రారంభించిన పనులైనా పూర్తి చేయలేని దద్దమ్మ సీఎం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదోని నియోజకవర్గం ఆరేకల్లులో ప్రభుత్వ మైనార్టీ ఉర్ధూ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7 కోట్లు నిధులు కేటాయించి, నిర్మాణ పనులు కూడా ప్రారంభించామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లుగా ఈ నిర్మాణాలను అంగుళం కూడా ముందుకు సాగనీయకుండా పాడుబెట్టారని ట్వీట్ చేశారు. మైనారిటీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డీ?! అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సాక్షీభూతం... అర్థంతరంగా నిలచిపోయిన ఈ కళాశాల నిర్మాణమన్నారు.
nara lokesh
twitter
ys jagan
padayatra

More Telugu News