kaluva srinivasulu: హనుమాపురంలో ఉద్రిక్తత... అతనో చెత్త ఎమ్మెల్యే అంటూ కాపు రామచంద్రారెడ్డిపై కాలువ నిప్పులు

  • రాయదుర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • 'కాపు'తో చర్చ కోసం గంటకు పైగా వేచి చూశానన్న 'కాలువ'
  • 'కాలువ'ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
tdp kaluva fires at ycp kapu ramachandra reddy

రాయదుర్గం నియోజకవర్గంలోని ఎన్.హనుమాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం ఇక్కడ పర్యటించి, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ సవాల్ ను స్వీకరించిన మాజీ మంత్రి, టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం ఎన్.హనుమాపురం చేరుకుకున్నారు. అభివృద్ధి పైన తాను చర్చకు సిద్ధమని, ఎమ్మెల్యే కాపు రావాలని ప్రతిసవాల్ చేశారు. చర్చ కోసం చాలాసేపు చూశారు.

ఇరుపార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు మోహరించారు. కాసేపటికి కాలువ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అక్కడి నుండి తరలించారు. కాలువను అదుపులోకి తీసుకునే సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా, పోలీసులు వారిని అక్కడి నుండి తప్పించారు. పోలీసు జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాలువ మీడియాతో మాట్లాడుతూ... అతను ఓ చెత్త ఎమ్మెల్యే అని, పనికి మాలిన ఎమ్మెల్యే అని మండిపడ్డారు. ప్రతి గ్రామానికి వెళ్లి... కాలువకు దమ్ముంటే అభివృద్ధి పైన చర్చకు రావాలని సవాల్ చేస్తాడని, తీరా అతని సవాల్ ను తాను స్వీకరించి అతను ఉన్న చోటకు వెళ్తే తోక ముడిచి పారిపోతాడని ఎద్దేవా చేశారు. 

అలాగే నిన్న హనుమాపురంకు వచ్చాడని, ఓ వృద్ధుడు ఆయనను నిలదీసినందుకు గాను అతనిపై కేసులు పెట్టించారన్నారు. అలాగే తనకు కూడా అభివృద్ధిపై నిన్న తనను సవాల్ చేశాడని, దీంతో తాను గంటన్నర ముందు వచ్చానని, కానీ అతను రాలేదన్నారు.

కాపు రామచంద్రా రెడ్డి రాకపోగా, పోలీసులు వచ్చి తనను ఈ గ్రామాన్ని ఖాళీ చేయమని చెబుతున్నారన్నారు. కాపు రావాల్సిన చోటుకు పోలీసులు ఎలా వచ్చారన్నారు. దమ్మిడీకి పనికి రానివాడు... మేం ప్రారంభించిన వాటిని పూర్తి చేయని దద్దమ్మ కాపు" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News