Virat Kohli: ఐపీఎల్ లో మరోసారి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ

  • మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • ఇంకా కోలుకోని ధావన్... పంజాబ్ సారథిగా శామ్ కరన్
  • ఆర్బీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ కు దూరం
  • ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేయనున్న వైనం
  • ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ
 Virat Kohli captains again DuPlessis absence in IPL

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా నిలుస్తోంది. సొంతగడ్డపై ఆడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

బెంగళూరు జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగనున్నాడని తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు. డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ కు దూరంగా ఉంటాడని వివరించాడు. గతంలో అనేక సీజన్ల పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి కెప్టెన్ గా కనిపించనున్నాడు. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా, ఆర్బీబీ జట్టు 5 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.

కాగా, ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు సారథి శిఖర్ ధావన్ ఆడడంలేదు. అతడు ఇంకా కోలుకోవాల్సి ఉందని తాత్కాలిక కెప్టెన్ శామ్ కరన్ వెల్లడించాడు. తుదిజట్టులోకి లియామ్ లివింగ్ స్టోన్, నాథన్ ఎల్లిస్ లను తీసుకున్నామని తెలిపాడు. 


More Telugu News