Mallu Bhatti Vikramarka: కేసీఆర్ తో ఎవరికీ న్యాయం జరగలేదు: మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka faults KCR government
  • కాంగ్రెస్ గెలిస్తే రాయితీతో రుణాలు ఇస్తామన్న భట్టి 
  • చేనేత కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తీసుకు వస్తామని హామీ 
  • ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు అందలేదని విమర్శ  
కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గురువారం అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారులకు రాయితీతో కూడిన రుణాలు ఇస్తామని చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీరు అందలేదన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ను చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరామ్ పూర్ మండలంలో ఈ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
Telangana

More Telugu News