YS Bhaskar Reddy: హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేసిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

YS Bhaskar Reddy bail petetion
  • హత్యతో తనకు సంబంధం లేదన్న భాస్కర్ రెడ్డి
  • తనకు ఆరోగ్యం కూడా బాగోలేదన్న అవినాశ్ తండ్రి
  • గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్య

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అయినా సీబీఐ అరెస్ట్ చేసిందని బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ఆరోగ్యం కూడా బాగోలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు. వివేకాను తాము హత్య చేసినట్టు ఆధారాలు కూడా లేవని... గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. వీరి బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News