Yash Chopra: యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా మృతి

Yash Chopras wife Pamela Chopra passes away at 74
  • కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పమేలా చోప్రా
  • ఆమె వయసు 74 ఏళ్లు
  • 2012లో మృతి చెందిన యశ్ చోప్రా
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత యశ్ చోప్రా భార్య పమేలా చోప్రా కన్నుమూశారు. ఆమె వయసు 74 ఏళ్లు. గత 15 రోజులుగా ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలను కూడా నిర్వహించారు. పమేలా చోప్రా కు ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. యశ్ చోప్రా 2012లో మృతి చెందారు. 

యశ్, పమేలా దంపతులది పెద్దలు కుదిర్చిన వివాహం. 1970లో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా ఉన్నారు. ఆదిత్య చోప్రా దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఉదయ్ చోప్రా సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Yash Chopra
Wife
Pamela Chopra

More Telugu News