Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ కు నిరాశ

  • మోదీ ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు
  • రెండేళ్ల జైలు శిక్ష విధంచిన సూరత్ కోర్టు
  • సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్
No relief for Rahul Gandhi in defamation case

మోదీ ఇంటి పేరుపై అభ్యంతరకరంగా కామెంట్ చేశారనే కేసులో గుజరాత్ లోని సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లోక్ సభ సభ్యత్వంపై కూడా అనర్హత వేటు పడింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో పరువునష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని సూరత్ లోని సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు తన పట్ల కఠనంగా వ్యవహరించిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. రెండేళ్లు శిక్ష విధించేంత కేసు ఇది కాదని అన్నారు. జైలు శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు చాలా నష్టం కలుగుతుందని అన్నారు. అయితే రాహుల్ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

More Telugu News