UK: బ్రిటన్ స్కూళ్లల్లో ఎగసిపడుతున్న హిందూ వ్యతిరేకత.. భారతీయ విద్యార్థులకు వేధింపులు

UK Based Think Tank Reports Massive Anti Hindu Hate In British Schools
  • బ్రిటన్ స్కూళ్లల్లో హిందు విద్యార్థులపై వివక్ష ఉందంటూ తాజా నివేదికలో వెల్లడి
  • హెన్రీ జాక్సన్ సొసైటీ అధ్యయనం బయటపడ్డ వాస్తవం 
  • తమ సంతానం వివక్ష ఎదుర్కొందని సగం మంది తల్లిదండ్రుల వెల్లడి

బ్రిటన్ విద్యాలయాల్లో హిందూ వ్యతిరేక భావజాలానికి భారతీయ విద్యార్థులు బాధితులుగా మారినట్టు హెన్రీ జాక్సన్ సొసైటీ అనే థింక్ ట్యాంక్ జరిపిన అధ్యయనంలో తాజాగా తేలింది. షార్లెట్ లిటిల్‌వుడ్ అనే పీహెచ్‌డీ విద్యార్థిని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. మొత్తం 988 మంది హిందూ విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. హిందూమతంపై వ్యతిరేకత కారణంగా తమ పిల్లలు స్కూళ్లల్లో వివక్ష ఎదుర్కొన్నట్టు సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. తమకు ఏ ఇబ్బంది ఎదురు కాలేదని కేవలం ఒక శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం. 

బ్రిటన్‌లో హిందువులపై వివక్ష విస్తృతంగా ఉన్నప్పటికీ కేవలం 1 శాతం పాఠశాలల్లోనే ఫిర్యాదులు నమోదైనట్టు సర్వేలో తేలింది. అంతేకాకుండా హిందువులపై వివక్షను స్కూళ్లు గుర్తించలేకపోతున్నాయని 81 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో హిందూ విద్యార్థులు ఇలాంటి వేధింపులను కొన్నేళ్ల పాటు భరించాల్సి వచ్చినట్టు గుర్తించారు. 

ఈ వేధింపులు తట్టుకోలేక తూర్పు లండన్‌కు చెందిన ఓ విద్యార్థి ఒకే ఏడాదిలో ఏకంగా మూడు సార్లు స్కూల్ మారాల్సి వచ్చినట్టు కూడా ఈ నివేదికలో తేలింది. వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న 22 ఏళ్లలోపు భారతీయ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నట్టు తేలింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న కరణ్ కటారియా తాను కళాశాలలో మతవివక్ష ఎదుర్కొన్నట్టు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. విద్యార్థి ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పోటీపడ్డ తనపై హిందువైన కారణంగా వ్యతిరేక ప్రచారం జరిగినట్టు ఆరోపించారు.

  • Loading...

More Telugu News