Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

Karnataka elections Congress campaigners
  • మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • మే 13న వెలువడనున్న ఫలితాలు
  • విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులను ఒడ్డుతోంది. ఈ క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, జగదీశ్ శెట్టార్, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, మునియప్ప, జి.పరమేశ్వర, ఎంబీ పాటిల్, హరిప్రసాద్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, డీకే సురేశ్, సతీశ్ జర్కిహోలి, వీరప్ప మొయిలీ, రేవణ్ణ, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, రేవంత్ రెడ్డి, కన్నయ్య కుమార్, రాజ్ బబ్బర్, అజారుద్దీన్, దివ్యస్పందన, రమేశ్ చెన్నితాల, పి. చిదంబరం, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భాఘేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రూపా శశిధర్ తదితరులు ఉన్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Karnataka
Elections
Congress
Campaigners

More Telugu News