Mallu Bhatti Vikramarka: కేసీఆర్ కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

Mallu Bhatti Vikramarka open letter to KCR
  • ప్రజలు ఆశించిన తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించిన భట్టి
  • 54 శాతం ఉన్న బీసీలకు 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని మండిపాటు
  • నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామన్న కాంగ్రెస్ నేత
ప్రజలు పోరాడి తెచ్చుకున్న, వారు ఆశించిన తెలంగాణ ఇదేనా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో 54 శాతం మంది బీసీలు ఉన్నారని... వారికి ఎన్ని నిధులు కేటాయించారని అడిగారు. 54 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్ లో కేవలం 5 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తారా? అని మండిపడ్డారు. పోనీ ఆ నిధులనైనా సక్రమంగా ఖర్చు చేశారా? అని నిలదీశారు. 

ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంపై స్పందిస్తూ... దాని గురించి తనకు తెలియదని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Uttam Kumar Reddy
Congress
KCR
BRS

More Telugu News