Telangana: తెలంగాణలో భానుడి భగభగ

Telangana registers high temparatures on wednesday
  • రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు
  • ఆదిలాబాద్, సూర్యాపేట, జగిత్యాల, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాలలోనూ 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 
భానుడి ప్రతాపానికి తెలంగాణ అల్లాడిపోతోంది. నానాటికీ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదైనట్టు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. జయశంకర్ జిల్లా మహదేవ్ పూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది. 

ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో 44.2. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో, ములుగు జిల్లా తాడ్వాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 44.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు పేర్కొంది.
Telangana

More Telugu News