Venkatesh Daggubati: త్వరలో వచ్చేస్తున్న 'రానా నాయుడు' సీజన్ 2

  • కొంతకాలం క్రితం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'రానా నాయుడు'
  • ముంబై నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • సెలబ్రిటీల జీవితంలోని చీకటి కోణాలు 
  • త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న సీజన్ 2
Rana Nayudu Season 2

వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. వెంకటేశ్ కి ఇది తొలి వెబ్ సిరీస్ కావడం వలన కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ వెబ్ సిరీస్ అంతా కూడా ముంబై నేపథ్యంలో జరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ జీవితాల్లోని చీకటి కోణాలను ఈ వెబ్ సిరీస్ ఆవిష్కరించింది. వెబ్ సిరీస్ లలో బూతులకి కొదవ ఉండటం లేదు. అయితే వెంకటేశ్ - రానాకి ఇక్కడ క్రేజ్ కారణంగా ఇలాంటి కంటెంట్ ను వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. 

సీజన్ 1 విషయంలో విమర్శలు బాగానే వినిపించాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఒక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా వదిలారు. సీజన్ 2 ఎలాంటి టాక్ మూటగట్టుకుంటుందనేది చూడాలి.

More Telugu News