YS Avinash Reddy: ముగిసిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ.. కొనసాగుతున్న అవినాశ్ రెడ్డి విచారణ

  • వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు
  • కోఠి కార్యాలయంలో అవినాశ్, భాస్కర్ రెడ్డి, ఉదయ్ ల విచారణ
  • రేపు మళ్లీ కొనసాగనున్న విచారణ
First day questioning of YS Bhaskar Reddy ended

వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ విచారణ ముగిసింది. కాసేపట్లో వీరిని హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. సాయంత్రం 5 గంటల్లోగా వారిని జైలుకు తరలిస్తారు. రేపు మళ్లీ వీరిని విచారణకు తీసుకురానున్నారు. మరోవైపు, అవినాశ్ రెడ్డి విచారణ ఇంకా కొనసాగుతోంది. సాక్ష్యాల తారుమారు గురించి భాస్కర్ రెడ్డి, ఉదయ్ లను సీబీఐ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ర. 40 కోట్ల డీల్ జరిగిందన్న దస్తగిరి ఆరోపణలపై కూడా ప్రశ్నించారని సమాచారం. ఇదిలావుంచితే, ఈ ఉదయం బీపీ కారణంగా భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైల్లోనే ఆయనకు చికిత్స అందించనున్నారు.

More Telugu News