Chandrababu: కడప పెద్ద దర్గాలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు

  • కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన చంద్రబాబు
  • కడపలో టీడీపీ జోన్-5 సమావేశానికి హాజరు
  • అనంతరం పెద్ద దర్గాకు తరలి వెళ్లిన వైనం
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత
Chandrababu attends Iftar in Kadapa

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ కడపలో టీడీపీ జోన్-5 సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ఆ సమావేశం ముగిసిన తర్వాత కడప పెద్ద దర్గాకు తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ స్థానిక విభాగాలు సోషల్ మీడియాలో పంచుకున్నాయి. ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా చంద్రబాబు ముస్లిం వేషధారణలో కనిపించారు.

More Telugu News