SRH: ఇవాళ ఆడుతోంది ముంబయితో... సన్ రైజర్స్ దే టాస్

  • ఇవాళ సొంతగడ్డపై ఆడుతున్న ఎస్ఆర్ హెచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న మార్ క్రమ్
  • వరుస విజయాలతో టచ్ లోకి వచ్చిన సన్ రైజర్స్, ముంబయి జట్లు
SRH won the toss against Mumbai Indians

ఐపీఎల్ లో అగ్రశ్రేణి జట్టయిన ముంబయి ఇండియన్స్ ను నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎదుర్కొంటోంది. అయితే ముంబయి ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా పడుతూ లేస్తూ ఆడుతోంది. ఇవాళ జరిగే మ్యాచ్ హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో కావడంతో, సొంతగడ్డపై సన్ రైజర్స్ మరింత చెలరేగిపోతారని అభిమానులు ఆశిస్తున్నారు. ముంబయి ఇండియన్స్ పై టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో ఫామ్ లోకి రావడం ఎస్ఆర్ హెచ్ శిబిరంలో ఉత్సాహం నింపింది. అయితే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇంకా టచ్ లోకి రాకపోవడం ఒక్కటే ఆ జట్టుకు సమస్యగా కనిపిస్తోంది. 

వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమైన హ్యారీ బ్రూక్ గత మ్యాచ్ లో మాత్రం సెంచరీ బాది విమర్శకులకు బ్యాట్ తో జవాబిచ్చాడు. రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ క్రమ్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ కూడా రాణిస్తే ఎలాంటి బౌలర్లకైనా తిప్పలు తప్పవు. 

బౌలింగ్ లోనూ సన్ రైజర్స్ కు మంచి వనరులే ఉన్నాయి. ఐపీఎల్ లో 150 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్, సఫారీ పేసర్ మార్కో జాన్సెన్ ఫామ్ లో ఉండగా... స్పిన్ లో మయాంక్ మార్కండే రాణిస్తున్నాడు. అటు ముంబయి జట్టు గత మ్యాచ్ లో కోల్ కతాపై విజయంతో ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, పియూష్ చావ్లా బౌలింగ్ లో రాణిస్తుండగా, బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ ఆకట్టుకున్నారు. మరి ఇవాళ సన్ రైజర్స్ ను వారి సొంతగడ్డపై ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News