Allu Ramesh: టాలీవుడ్ కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూత

Tollywood comedian Allu Ramesh passes away
  • వైజాగ్ లో గుండెపోటుతో మృతి చెందిన అల్లు రమేశ్
  • సంతాపం ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు
  • 'సిరిజల్లు' సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన రమేశ్
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ అల్లు రమేశ్ ఈరోజు హఠాన్మరణం చెందారు. విశాఖలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని యువ దర్శకుడు ఆనంద్‌ రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. 

హీరోగానే అల్లు రమేశ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలి చిత్రం 'సిరిజల్లు'. ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉండగా అల్లు రమేశ్ వారిలో ఒకరు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా నటించారు. దిల్ రాజు నిర్మించిన 'కేరింత' చిత్రంలో నూకరాజుకు తండ్రిగా నటించారు. ఇటీవల విడుదలైన 'నెపోలియన్' చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించారు. వెబ్ సిరీస్ లో సైతం ఆయన నటించారు.
Allu Ramesh
Tollywood

More Telugu News