Uttar Pradesh: యూపీ గ్యాంగ్ స్టర్ల హత్యలో మరో సంచలనం

Atiq Ahmed and Ashraf Lawyer Big Allegation Against UP Police
  • పదిహేను రోజుల్లో మీ పని ఖతం.. అంటూ ఉన్నతాధికారి హెచ్చరించాడన్న అష్రఫ్
  • మార్చి 29న బరేలీ జైలుకు తరలించిన సందర్భంలో మీడియాకు వెల్లడించిన గ్యాంగ్ స్టర్
  • ఆ ఉన్నతాధికారి పేరును సీల్డ్ కవర్ లో రాసి పెట్టినట్లు వెల్లడి
  • తను చనిపోతే ఆ కవర్ యూపీ సీఎం, సీజేఐలకు చేరుతుందన్న అష్రఫ్
గ్యాంగ్ స్టర్లు అతీక్, అష్రఫ్ ల హత్య ఉత్తరప్రదేశ్ లో సంచలనం స‌ృష్టించిన విషయం తెలిసిందే! ఈ కేసులో అష్రఫ్ లాయర్ మరో సంచలన విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. తన క్లయింట్ అష్రఫ్ ను పోలీసు ఉన్నతాధికారి ఒకరు కొన్నిరోజుల కిందట హెచ్చరించారని చెప్పాడు. పదిహేను రోజుల్లో మీ పని ఖతం అంటూ బెదిరించాడని వివరించాడు. అష్రఫ్, అతీక్ లను ప్రయాగ్ రాజ్ జైలు నుంచి బరేలి జైలుకు తరలించినపుడు ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. అయితే, ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.

ప్రయాగ్ రాజ్ జైలు నుంచి బరేలి జైలుకు తీసుకెళ్లాక పోలీసు ఉన్నతాధికారి తనతో మాట్లాడుతూ.. ఈసారి బతికిపోయావు కానీ మరో పదిహేను రోజుల్లో నిన్ను జైలు నుంచి బయటకు తీసుకెళ్లి చంపేస్తామని బెదిరించాడని మార్చి 29 న అష్రఫ్ మీడియాతో చెప్పాడు. అయితే, తనను బెదిరించిన వ్యక్తి ఉన్నతాధికారి కావడంతో ఆయన పేరు చెప్పలేనని అష్రఫ్ వివరించాడు. తను చనిపోతే యూపీ సీఎం యోగితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అలహాబాద్ చీఫ్ జస్టిస్ లకు ఓ సీల్డ్ కవర్ పంపే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. ఆ కవర్ లో తనను బెదిరించిన పోలీస్ అధికారి పేరు రాసి పెట్టానని చెప్పాడని అష్రఫ్ లాయర్ విజయ్ మిశ్రా తెలిపాడు.
Uttar Pradesh
gangster
ashraf
murder threat
police warning

More Telugu News