తాయత్తు కట్టుకోవడం వల్లే బతికాను: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
- చిన్నప్పుడు తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారన్న శ్రీనివాసరావు
- తన తాత పక్కనున్న మసీదులో తాయత్తు కట్టించాడని వెల్లడి
- హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
తాజా వివాదం వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెంలో ముస్లింలకు ఆయన తన జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బాల్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారని... అప్పుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని... ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ను శ్రీనివాసరావు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.