Ponguleti: పొంగులేటి ఇంటికి వెళ్లి 6 గంటలు చర్చించిన రాహుల్ గాంధీ టీమ్

Rahul Gandhi team meets Ponguleti
  • ఇటీవలే పొంగులేటిని సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
  • తన వర్గానికి 10 సీట్లు కావాలని రాహుల్ టీమ్ కు చెప్పిన పొంగులేటి
  • భట్టి, రేణుకాచౌదరి అసహనం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ కలిసింది. ఆయనతో దాదాపు 6 గంటల సేపు చర్చించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగులేటిని రాహుల్ టీమ్ కోరింది. తన వర్గానికి 10 స్థానాలను ఇవ్వాలని ఈ సందర్భంగా రాహుల్ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని కూడా పొంగులేటి కోరడం గమనార్హం. అయితే ఖమ్మం జిల్లాలో మధిర మినహా మిగిలిన స్థానాలను పరిశీలిస్తామని రాహుల్ టీమ్ భరోసా ఇచ్చింది. మరోవైపు పొంగులేటి షరతులపై ఖమ్మం జిల్లా సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి అసహనం వ్యక్తం చేశారు.  

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పొంగులేటి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ తో ఆయనకు క్రమంగా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆయనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ ప్రయత్నిస్తున్నాయి.


Ponguleti
Congress
Rahul Gandhi

More Telugu News