bicycle: వినూత్న ఆవిష్కరణ.. స్క్వేర్ ఆకారపు చక్రాలతో సైకిల్!

This specially designed bicycle with square wheels is redefining physics

  • యూ ట్యూబర్ మిష్టర్ క్యూ ఆవిష్కరణే నాలుగు పలకల చక్రాల సైకిల్
  • సాధారణ సైకిల్ మాదిరే తొక్కుకుంటూ వెళ్లొచ్చు
  • 30 లక్షలకు పైగా వ్యూస్
  • అదనపు శ్రద్ధ అవసరమంటున్న నెటిజన్లు

సైకిల్ నుంచి కారు, లారీ, చివరికి రైలు చక్రం వరకు అన్నీ గుండ్రంగానే ఉండడాన్ని గమనించి ఉంటారు. అసలు వాహనానికి చక్రం గుండ్రంగానే ఎందుకు ఉండాలి? అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి సందేహమే ఓ వ్యక్తికి వచ్చింది. అందుకే గుండ్రంగా ఎందుకు..? వెరైటీగా స్క్వేర్ ఆకారంలో తయారు చేద్దామని అనుకున్నాడు. ప్రయత్నిస్తే పోయేదేముంది? అనుకుని కష్టపడి మరీ అనుకున్నది ఆవిష్కరించాడు. 

యూ ట్యూబర్ మిష్టర్ క్యూ ఈ సైకిల్ ను తయారు చేశాడు. చక్రం అంటేనే గుండ్రంగా ఉంటుంది కదా? మరి స్క్వేర్ గా చేస్తే ఎలా తిరుగుతుంది? వీటికి సమాధానమే మిష్టర్ క్యూ ఆవిష్కరణ అని చెప్పుకోవాలి. మనోడు కేవలం వీల్ ను మాత్రమే స్క్వేర్ గా ఆవిష్కరించాడు. ఈ పోస్ట్ కు 30 లక్షలకు పైనే వ్యూస్ వచ్చాయి. యూజర్లు ఆసక్తిగా ఈ సైకిల్ ను చూసేస్తున్నారు. వినూత్నమైన సైకిల్ కొందరికి ఎంతగానే నచ్చేసింది. చక్రాలు నాలుగు పలకలుగా ఉంటే మరింత శ్రద్ధ అవసరమని, దీంతో ప్రయాణ సమయంలో అదనపు భారం పడుతుందని కొందరు యూజర్లు కామెంట్లు పెట్టారు. 

  • Loading...

More Telugu News