‘తంగలాన్’ మేకింగ్ వీడియో.. అంచనాలను పెంచేసిన పా.రంజిత్

Thangalaan Exclusive Making From the Sets
  • చియాన్‌ విక్రమ్‌ బర్త్ డే సందర్భంగా తంగలాన్ మేకింగ్ వీడియో విడుదల
  • డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన విక్రమ్‌
  • అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
చియాన్‌ విక్రమ్‌.. సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘అపరిచితుడు’గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన.. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ఇటీవల మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలో మెరిశారు. ఆ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం అదే జోష్‌తో ‘తంగలాన్‌’ సినిమా పూర్తి చేస్తున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే తంగలాన్. శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సోమవారం విక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ వీడియో అద్భుతంగా ఉంది. సినిమా కోసం తన దేహాన్ని పూర్తిగా మార్చుకుని, డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన విక్రమ్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. వీడియో చివర్లో వచ్చే సీన్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

19వ శతాబ్దంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ దీనిని విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్‌ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్‌, పార్వతి నటిస్తున్నారు.

Go Back to Shorts
Chiyaan Vikram
Pa Ranjith
G V Prakash Kumar
Thangalaan

More Telugu News