Gargeyi Yellapragada: 'హలో మీరా' .. ఒకే ఒక పాత్రతో చేసిన ప్రయోగం!

Hello Meera Movie Update
  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'హలో మీరా'
  • ఒకే ఒక పాత్రతో నడిచే సినిమా
  • ప్రధానమైన పాత్రను పోషించిన గార్గేయి ఎల్లాప్రగడ  
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
సినిమా అంటే అనేక పాత్రలు ఉంటాయి .. ఆయా సందర్భాలను బట్టి అవి తెరపైకి వస్తుంటాయి. కొన్ని పాత్రలు నవ్విస్తే .. మరికొన్ని పాత్రలు ఏడిపిస్తాయి. ప్రేమ .. పగ .. ద్వేషం .. విధ్వంసం వంటివి సన్నివేశాల్లో అనేక పాత్రల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలాంటి పాత్రలేవీ లేకుండా ఒకే ఒక పాత్రతో సినిమా నడిస్తే ఎలా ఉంటుందనేది ఊహించలేం. 

అలా ఊహకందని కథాకథనాలతో దర్శకుడిగా కాకర్ల శ్రీనివాస్ రూపొందించిన సినిమానే 'హలో మీరా'. దర్శకుడు బాపు దగ్గర ఆయన దర్శకత్వ శాఖలో చాలాకాలం పనిచేశారు. తొలిసారిగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. గార్గేయి ఎల్లాప్రగడ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నారు. 

అనేక పాత్రలను తెరపై పరుగులు పెట్టిస్తుంటేనే ప్రేక్షకులను రెండు గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టటడం కష్టంగా ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఒకే ఒక పాత్రతో కథను రెడీ చేసుకోవడం ఒక ప్రయోగమే .. ఆ పాత్ర ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేయడం నిజంగా ఒక సాహసమే. చూడాలిమరి ఈ కాన్సెప్ట్ ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో. 
Gargeyi Yellapragada
Hello Meera Movie
Kakarla Srinivas

More Telugu News