Telangana: స్పీడు పెంచిన కాసాని.. తెలంగాణ టీడీపీకి కొత్త కార్యవర్గం

  • రెండో విడతలో మొత్తం 31 మందికి అవకాశం
  • ప్రకటించిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని 
  • ఇప్పటికి 36 పదవుల భర్తీ
Kasani announces New working committee for TTDP

తెలుగుదేశం పార్టీ తెలంగాణ (టీటీడీపీ) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో విడతల వారీగా కొత్త కార్యవర్గాన్ని నియమిస్తున్నారు. ఆయన తాజాగా ప్రకటించిన కమిటీలో ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఏడుగురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, 10 మంది కార్యదర్శులు, మీడియా కమిటీ చైర్మన్, కోఆర్డినేటర్లు ఉన్నారు. పార్టీ అనుబంధ విభాగాలైన ఎస్టీ, లీగల్, కల్చరల్, రైతు, గీత కార్మికుల విభాగాలకు కూడా కాసాని అధ్యక్షులను ప్రకటించారు. 

అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ రాష్ట్ర కమిటీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత వారం తొలి విడతలో వివిధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఐటీడీపీ, టీఎన్టీయూసీ విభాగాల నాయకుల ఖాళీలను భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 31 మందిని కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు. ఈ రెండు విడతల్లో కలిపి 36 మందికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. మూడో విడతలో పూర్తి స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తామని జ్ఞానేశ్వర్ తెలిపారు. కాగా, గతంలో రాష్ట్ర కమిటీలో 160 మంది ఉన్నారు. దానిని సగానికి కుదించాలని జ్ఞానేశ్వర్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

టీటీడీపీ కార్యవర్గం
ఉపాధ్యక్షులు: వాసిరెడ్డి రామనాథం, అలీ మస్కతీ, బండి పుల్లయ్య,
ప్రధాన కార్యదర్శులు: జక్కలి ఐలయ్య, ఎ.కె. గంగాధర్, టి. మధుసూదన్ రెడ్డి 
అధికార ప్రతినిధులు: నెల్లూరి దుర్గాప్రసాద్, శ్రీనివాస్ నాయుడు, దామెర సత్యం 
ఆర్గనైజింగ్ సెక్రటరీలు: కనగాల సాంబశివరావు, మద్దూరి సాయి తులసి, రవీంద్రచారి, సైదేశ్వర్ రావు, కల్యాడపు ఆగయ్య, సందయ్యపోగు రాజశేఖర్, పి. స్వామి ముదిరాజ్ 
మీడియా కమిటీ చైర్మన్: టి. ప్రకాష్ రెడ్డి
ఎస్టీ సెల్ అధ్యక్షుడు: గోపి
తెలుగు రైతు అధ్యక్షుడు: కాప కృష్ణమూర్తి 
లీగల్ సెల్ అధ్యక్షుడు: రఘువర్ధన్ ప్రతాప్
కల్చరల్ సెల్ అధ్యక్షుడు: చంద్రహాస్ 
తెలుగునాడు గీత కార్మిక అధ్యక్షుడు: గజేంద్ర గౌడ్

More Telugu News