Delhi Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో ముగిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ

Delhi CM kekriwal leaves cbi headquarters after 9 hours of questioning
  • ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ
  • విచారణ అనంతరం మీడియాకు అభివాదం చేస్తూ వెళ్లిపోయిన సీఎం
  • సీబీఐ విచారణ సందర్భంగా ఆప్ నేతల నిరసన
  • పలువురు కీలక నేతలను అరెస్టు చేసిన పోలీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణ ముగిసింది. ఆయనను సీబీఐ దాదాపు 9 గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ తన కారులో వెళ్లిపోయారు. సీబీఐ నోటీసుల మేరకు సీఎం ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు విచారణకు హాజరయ్యారు.  

అంతకుమునుపు ఆప్ శ్రేణులు తమ పార్టీ నాయకుడికి సీబీఐ సమన్లు జారీ చేయడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగాయి. ఈ క్రమంలో నిరసన చెపట్టిన కొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ ఛద్దా, మంత్రులు సౌరభ భరద్వా్జ్, అతిషీ, కైలాశ్ తదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, పార్టీ నేతల అరెస్టు నేపథ్యంలో తదుపరి కార్యాచరణ నిర్ణయించేందుకు ఆప్ నేతలు.. ఢిల్లీ పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
Delhi Liquor Scam

More Telugu News