Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్ కు తప్పిన ప్రమాదం

  • కరీంనగర్ జిల్లా పర్యటనలో అపశృతి
  • చెర్లబుట్కూర్ లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కమలాకర్
  • ఒక్కసారిగా కుప్పకూలిన సభా వేదిక
  • మంత్రి కాలుకు గాయం
  • విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన డాక్టర్లు
Minister Gangula Kamalakar gets minor injury in stage collapse incident

మంత్రి గంగుల కమలాకర్ నేడు కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కరీంనగర్ లోని చెర్లబుట్కూర్ లో ఓ కార్యక్రమానికి కమలాకర్ హాజరయ్యారు. ఆయన నిల్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో కమలాకర్ తో పాటు వేదికపై ఉన్న ఇతరులు కిందపడిపోయారు. ఈ ఘటనలో మంత్రి కాలికి స్వల్ప గాయమైంది. 

ఆయనకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన ఓ జడ్పీటీసీ సభ్యుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి కమలాకర్ మీడియాతో మాట్లాడారు. సభావేదిక కూలిన ఘటనలో స్వల్ప గాయాలయ్యాయని, డాక్టర్లు చికిత్స చేశారని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు.

More Telugu News