IPL Betting: వ్యసనంగా మారిన బెట్టింగ్.. ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు

  • తొలుత సరదాగా బెట్టింగ్ కు అలవాటు పడ్డ వ్యాపారి
  • 12 ఏళ్లలో రూ.100 కోట్లు పోగొట్టుకున్న వైనం
  • బెట్టింగ్ లోనే తిరిగి సంపాదించాలని సబ్ బుకీ అవతారమెత్తిన వ్యాపారి
  • అతడితో పాటు  ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
  • రూ.20 లక్షలు స్వాధీనం, బ్యాంకుల్లోని రూ.1.42 కోట్లు ఫ్రీజ్‌‌‌‌ 
police arrested three sub bookies from hyderabad in betting

రూ.100 కోట్లు.. ఇది బెట్టింగ్ లో ఓ వ్యాపారి పోగొట్టుకున్న డబ్బు. మీరు చదివింది నిజమే. ఒకటీ రెండు కాదు.. అక్షరాలా వంద కోట్లు. వ్యాపారంలో సంపాదించుకున్నదంతా బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న సొమ్మును బెట్టింగ్ లోనే రాబట్టుకోవాలనుకుని.. బుకీ అవతారమెత్తాడు. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు. 

హైదరాబాద్ వనస్థలిపురం వెంకటరమణ కాలనీకి చెందిన జక్కిరెడ్డి అశోక్ రెడ్డి రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారం చేస్తున్నాడు. తొలుత సరదాగా బెట్టింగ్ పెట్టేవాడు. తర్వాత అది అలవాటుగా మారి.. చివరికి వ్యసనమైంది. ఇలా గత 12 ఏళ్లలో క్రికెట్లో బెట్టింగ్‌ పెట్టి, దాదాపు రూ.100 కోట్లు పోగొట్టుకున్నాడు. అవి తిరిగి సంపాదించాలని సబ్ బుకీ అవతారమెత్తాడు.

అతనికి ఏపీకి చెందిన బుకీలు పలాస శ్రీనివాస్‌‌‌‌ రావు, సురేశ్ పరిచయం అయ్యారు. ఆ ఇద్దరికీ అశోక్ రెడ్డి సబ్‌‌‌‌ బుకీగా వ్యవహరించి బెట్టింగులు నిర్వహించాడు. వీరికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఏడుకుల్ల జగదీశ్‌‌‌‌ రావు జతకలిశాడు. వీరంతా హర్యానాలోని ప్రధాన బుకీ విపుల్‌‌‌‌ మోంగాతో కలిసి బెట్టింగ్‌‌‌‌ నిర్వహిస్తున్నారు.

బెట్టింగ్‌ కలెక్షన్ల కోసం కూకట్‌‌‌‌పల్లి భక్తినగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ ఒడుపు చరణ్ పనిచేస్తున్నాడు. విపుల్‌‌‌‌ మోంగా క్రియేట్‌‌‌‌ చేసిన ‘నేషనల్ ఎక్స్చేంజ్9’ ద్వారా జగదీశ్‌‌‌‌ రావు, అశోక్‌‌‌‌ రెడ్డి, చరణ్ హైదరాబాద్‌‌‌‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందు కోసం చైతన్యపురిలో ఓ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌  జనరేట్‌‌‌‌ చేసి సర్క్యులేట్‌‌‌‌ చేసేవారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, గూగుల్‌‌‌‌ పే ద్వారా అమౌంట్‌‌‌‌ కలెక్ట్‌‌‌‌ చేసేవారు. 

నిందితులు ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌ లో బెట్టింగ్ పెట్టి దాదాపు రూ.3 కోట్లు సంపాదించారు. గత శుక్రవారం కోల్‌‌‌‌కతాలో ‘సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ వర్సెస్‌‌‌‌ కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌’ మ్యాచ్‌‌‌‌ జరగ్గా చైతన్యపురి వాసవి కాలనీలోని బసంతి బొటిక్‌‌‌‌లో బెట్టింగ్‌‌‌‌  నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఎల్బీ నగర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌వోటీ, చైతన్యపురి పోలీసులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. జగదీశ్‌‌‌‌ రావు, అశోక్‌‌‌‌ రెడ్డి, చరణ్ లను అరెస్టు చేశారు. రూ.20 లక్షల నగదు, 7 సెల్‌‌‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లోని రూ.1.42 కోట్లను ఫ్రీజ్ చేశారు.

More Telugu News