Akhil: నన్ను ఇబ్బంది పెడతానని సూరి ముందుగానే చెప్పాడు: అఖిల్

  • 'ఏజెంట్' ప్రమోషన్లో అఖిల్ 
  • తాను కొత్తగా కనిపించడానికి కారకుడు సూరి అని వెల్లడి
  • మమ్ముట్టి సార్ తో చేయడం అదృష్టమని వ్యాఖ్య 
  • ఈ నెల 28వ తేదీన విడుదలవుతున్న సినిమా  
Agent movie press meet

అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఏజెంట్' సినిమా రెడీ అవుతోంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో అఖిల్ మాట్లాడుతూ .. "ఈ కథ చెప్పడానికి వచ్చినప్పుడే, 'నేను ఇబ్బంది పెడతాను .. మీరు పడాలి' అని సూరి ముందుగానే చెప్పాడు" అని అన్నాడు.

" ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడం మొదలైన దగ్గర నుంచి, అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడని చాలామంది అన్నారు. అలా కనిపించడానికి కారకుడు సురేందర్ రెడ్డినే. గట్టిగా ట్రై చేస్తే సిక్స్ ప్యాక్ ఎవరైనా సాధించవచ్చు. కానీ ఈ సినిమా వలన నేను మెంటల్ స్ట్రెంత్ ను సంపాదించాను. ఈ సినిమా చేసినందుకు చాలా సంతృప్తికరంగా ఉన్నాను" అని అన్నాడు. 

" ఇక మమ్ముట్టి గారి గురించి ఏం మాట్లాడమంటారు? ఆయన వందల్లో సినిమాలు చేశారు. ఆయన సెట్లో ఉంటేనే ఆయన చుట్టూ ఒక ఆరా ఉన్నట్టుగా అనిపించేది. తెలుగులోనే ఆయన మాట్లాడేవారు. అలంటి ఒక సీనియర్ స్టార్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News