తిరుమల శ్రీవారికి రూ.1 కోటి విరాళం ఇచ్చిన హైదరాబాద్ భక్తులు
- ఎస్సార్సీ ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ తరఫున విరాళం
- వైవీ సుబ్బారెడ్డికి డిమాండ్ డ్రాఫ్ట్ అందజేసిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్
- కృతజ్ఞతలు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
తాము అందించిన విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు కార్యకలాపాలకు వినియోగించాల్సిందిగా ఆ భక్తులు వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నందుకు ఆ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.