Jogi Ramesh: దేశ చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం: ఏపీ మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh praises Jagananna mana Bhavishyat programme
  • జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం అరుదైనదన్న జోగి రమేశ్
  • ఏడు లక్షల మంది జగనన్న సైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారన్న మంత్రి
  • 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారని వెల్లడి
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైనదని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఏడు లక్షల మంది జగనన్న సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. వారం రోజుల్లో వీరంతా 61 లక్షల ఇళ్లను సందర్శించారని అన్నారు. జగన్ కు మద్దతుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ చేశారని చెప్పారు. 

జగన్ అమలు చేస్తున్న నవరత్నాలతో రాష్ట్రంలో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల పార్టీ కన్వీనర్లు, గృహసారథులను నియమించారు.
Jogi Ramesh
Jagan
YSRCP

More Telugu News