Vizag Steel Plant: సింహాచలంకు చేరుకున్న విశాఖ ఉక్కు కార్మికుల పాదయాత్ర

Visakha steel plant workers padayatra reaches Simhachalam
  • ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికుల పాదయాత్ర
  • కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని కార్మికుల మండిపాటు
  • పాదయాత్రలో పాల్గొన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన పాదయాత్ర సింహాచలంకు చేరుకుంది. పాత గాజువాక, పెదగంట్రాడ, కూర్మన్నపాలెం నుంచి బయల్దేరిన కార్మికులు సింహాచలం దేవస్థానానికి చేరుకున్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని కార్మికులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. పాదయాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పాల్గొని కార్మికులకు సంఘీభావాన్ని ప్రకటించారు.
Vizag Steel Plant
padayatra

More Telugu News