Pawan Kalyan: మేకల్ని బలి ఇస్తారు, పులులను బలి ఇవ్వరు... కాబట్టి పులుల్లా బతకండి: పవన్ కల్యాణ్

  • అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానన్న పవన్
  • భరత జాతికి మహా సూత్రాలను అందించిన గొప్ప నేత అని కితాబు
  • అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవితాంతం కృషి చేశారని ప్రశంస
Live like tigers says pawan kalyan

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్పూర్తిదాయకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ' నేను.. నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే గొప్పది' అని అంబేద్కర్ చెప్పారని... ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరని అన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అంబేద్కర్ అందించారని కొనియాడారు. మన దేశం, మన ప్రజలు సమైక్యంగా, సమున్నతంగా, శక్తిమంతంగా, సమభావంగా ముందుకు సాగడానికి రాజ్యాంగం ద్వారా పద నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ లాంటి మహా జ్ఞానులు కోటి మందికి ఒక్కరే ఉంటారని చెప్పారు. 

మేకలను బలి ఇస్తారని, పులులను బలి ఇవ్వరని... అందుకే అందరూ పులుల్లా బతకాలని చెపుతూ అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని అంబేద్కర్ పెంచారని పవన్ తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తున్నాని చెప్పారు.

More Telugu News