Pawan Kalyan: చీమలపాడు బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడిన పవన్ కల్యాణ్

Pawan Kalyan talks to Cheemalapadu victims family members
  • ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
  • అగ్నిప్రమాదంలో ముగ్గురి మృతి
  • బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేనాని
  • అన్ని బెనిఫిట్స్ అందేలా చూస్తానని హామీ
  • ఏదైనా అన్యాయం జరిగితే తనకు కాల్ చేయాలని సూచన
ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నేపథ్యంలో, బాణసంచా కారణంగా అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందడం తెలిసిందే. పలువురు గాయపడ్డారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 

చీమలపాడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బాధితులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా అన్యాయం జరిగితే తనకు కాల్ చేయాలని పవన్ వారికి సూచించారు.
Pawan Kalyan
Cheemalapadu
Victims
Janasena
Telangana

More Telugu News