Summer: ఏపీలో నిప్పులు చెరిగే ఎండలు... నంద్యాలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత

  • ఏప్రిల్ రెండో వారం నాటికే మండిపోతున్న ఎండలు
  • అనేక జిల్లాల్లో నేడు భానుడి ఉగ్రరూపం
  • చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు
Summer temperatures rises in AP

ఇంకా మే నెల కూడా రాలేదు.... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నాటికే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఇవాళ ఏపీలో నిప్పులు చెరిగే ఎండకు ప్రజలు విలవిల్లాడిపోయారు. నంద్యాలలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

ప్రకాశం జిల్లాలో 44 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 43.8, కడప 43.8, తిరుపతి 43.5, శ్రీకాకుళం 43, అనకాపల్లి 43, ఎన్టీఆర్ జిల్లాలో 43 డిగ్రీలు, నెల్లూరు, సత్యసాయి, అల్లూరి, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

తూర్పు గోదావరి, పల్నాలడు, ఏలూరు జిల్లాల్లో 42.5 డిగ్రీలు, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, కోనసీమ, కాకినాడలో 42 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 41.5 డిగ్రీలు, బాపట్ల, పశ్చిమ గోదావరిలో 41, విశాఖలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

More Telugu News