K Kavitha: సుఖేశ్ తో నాకు పరిచయం లేదు: ఎమ్మెల్సీ కవిత వివరణ

I dont have contact with Sukesh says Kavitha
  • కేసీఆర్ ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కవిత
  • కొందరు పాత్రికేయులు విలువలు పాటించడం లేదని మండిపాటు
  • ఎవరీకీ తలవంచే పరిస్థితే లేదని వ్యాఖ్య
తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యంగా తనమీద కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు మద్దతు లభిస్తోందని, బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా ఛానళ్లు, పేపర్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్థిక నేరగాడైన సుఖేశ్ చంద్రశేఖర్ తనను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేయడం, వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఆ తర్వాత బీజేపీ ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్ లో బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టడం ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని విమర్శించారు. సుఖేశ్ తో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఆయనతో తనకు సంబంధం లేదని తెలిపారు. పాత్రికేయులు కనీస విలువలను కూడా పాటించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ బిడ్డలం తల వంచమని, తెగించి కొట్లాడతామని చెప్పారు.
K Kavitha
KCR
BRS
Sukesh

More Telugu News