దసరా సినిమా బ్రిలియంట్ గా ఉందన్న మెగాస్టార్

  • నాని, కీర్తి సురేశ్ నటనను మెచ్చుకున్న చిరంజీవి
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా అంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య
  • చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’ ఇటీవల థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఇదే తొలి సినిమా అంటే నమ్మశక్యంగా లేదని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి మెచ్చుకోవడంతో తనకు చాలా సంతోషంగా ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పారు. మెగాస్టార్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ‘ఎగురుతున్నా.. థాంక్యూ బాస్’ అంటూ ట్వీట్ చేశారు.

దసరా సినిమా బ్రిలియెంట్ గా ఉందని మెగస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. నానీ మేకోవర్ తో, తన ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడని, కీర్తి సురేశ్ వావ్ అనేలా నటించిందని ప్రశంసించారు. యువ నటుడు దీక్షిత్ ఆకట్టుకున్నాడని చెప్పారు. అదేవిధంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పైనా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. మొత్తంగా చిత్ర యూనిట్ అద్భుతమైన సినిమాను తెరకెక్కించిందని చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.


More Telugu News

megastar dasara movie Nani Keerthy Suresh srikanth odela twitter