Temparature: తెలంగాణలో నేడు, రేపు ఎండలు మండిపోతాయ్!

Temperature in Telangana may rise up to 43 degrees celsius today and tomorrow
  • ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 వరకు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిక
  • ఉదయం 9 నుంచే భానుడి ప్రతాపం మొదలు
  • అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా, గురు, శుక్ర వారాలలో (నేడు, రేపు) రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల దాకా నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని, చల్లని పానీయాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఆదిలాబాద్ లో బుధవారం 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, కనిష్ఠంగా మెదక్ లో 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News