Akhil: ఈ బ్యూటీ బాపు గీసిన బొమ్మనే .. బాలు పాడిన పాటనే!: సాక్షివైద్య లేటెస్ట్ పిక్స్

  • 'ఏజెంట్' సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సాక్షి వైద్య
  • ఈ నెల 28వ తేదీన విడుదలవుతున్న సినిమా  
  • లైన్లో ఉన్న వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున'
  • సోషల్ మీడియాలో హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ
Sakshi Vaidya Special

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కృతి శెట్టి .. శ్రీలీల .. అనన్య పాండే .. సంయుక్త మీనన్ .. ఆషిక రంగనాథ్ వంటివారు ఆ జాబితాలో కనిపిస్తారు. తాజాగా మరో ముంబై భామ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ బ్యూటీ పేరే 'సాక్షి వైద్య'. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన ఈ సుందరి, మోడలింగ్ వైపు నుంచి సినిమాల వైపు వచ్చింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన 'ఏజెంట్' సినిమాతో 'సాక్షి వైద్య' పరిచయమవుతోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చక్కని కనుముక్కుతీరుతో కుర్రాళ్లను కలల్లో ముంచేసే ఈ సుందరి, ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా పేరే 'గాండీవధారి అర్జున'. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా సందడి చేయనుంది. ఇక మిగతా యంగ్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లను అందుకోవడానికి ఆమె తన లేటెస్ట్ పిక్స్ ను వదులుతూనే ఉంది. ఈ ఫొటోల్లో వైట్ కలర్ డ్రెస్ లో పున్నాగ పూలగుత్తిని గుర్తుచేస్తున్న ఈ బ్యూటీకి అభిమానులు కాకుండా కుర్రాళ్లను ఆపడం కష్టమే.

More Telugu News