పంజాబ్ మిలటరీ స్టేషన్లో కాల్పుల కలకలం
- సివిల్ డ్రెస్ లో వచ్చిన ఇద్దరి కాల్పుల్లో నలుగురి మృతి
- ఈ ఉదయం తెల్లవారుజామున ఘటన
- ఉగ్రదాడి కాదని చెబుతున్న అధికారులు
ఆర్మీ అధికారుల మెస్‌లోనే కాల్పులు జరిగినట్లు సమాచారం. మృతి చెందిన నలుగురు 80 మీడియం రెజిమెంట్ కు చెందిన వారని అధికారులు చెబుతున్నారు. సివిల్ డ్రెస్సుల్లో లోపలికి వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపినట్టు గుర్తించారు. ఇది ఉగ్రదాడి కాదని, సైనికుల మధ్యనే కాల్పులు జరిగినట్టు పంజాబ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.