G Square: తిరుమలలో కాటేజీల నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం ఇచ్చిన చెన్నై సంస్థ

Chennai real estate firm announced huge donation to TTD
  • కాటేజి డొనేషన్ పథకం ప్రవేశపెట్టిన టీటీడీ
  • రూ.25.77 కోట్ల డొనేషన్ ప్రకటించిన జీ స్క్వేర్ సంస్థ
  • జీ స్క్వేర్ చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రవేశపెట్టిన కాటేజీ డొనేషన్ పథకంలో రికార్డు నమోదైంది. చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. జీ స్క్వేర్ సంస్థ తిరుమల కొండపై రూ.25.77 కోట్లతో హెచ్ వీడీసీ కాటేజీల నిర్మాణం చేపట్టి, ఆ కాటేజీలను టీటీడీకి అందించనుంది. కాటేజ్ డొనేషన్ పథకం కింద తిరుమలలో అతిథి గృహాల నిర్మాణానికి టీటీడీ అనుమతిస్తోంది. 

తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు

తిరుమల క్షేత్రంలో మే 14 నుంచి 18వ తేదీ వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆకాశగంగ వద్ద ఐదు రోజుల పాటు హనుమంతుని జన్మ విశేషాల వివరణ, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కోణాల్లో ప్రముఖ పండితులతో ప్రసంగాలు... తిరుమల వేద విజ్ఞానపీఠంలో అఖండ పారాయణం, యాగ నిర్వహణ... ధర్మగిరి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీల్లో వేదపండితులలో అధ్యయనాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మే 16న మొదలయ్యే అఖండ పారాయణం 18 గంటల పాటు ఏకధాటిగా కొనసాగుతుందని తెలిపారు. తిరుమల నాద నీరాజనం వేదికపై నిత్యం ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
G Square
Donation
Cottage Donation
TTD
Tirumala
Chennai

More Telugu News