Kasani Jnaneshwar: త్వరలో తెలంగాణ టీడీపీలో ముఖ్య నాయకుల చేరికలు ఉంటాయి: కాసాని జ్ఞానేశ్వర్

Kasani Jnaneshwar says senior leaders will join TDP soon
  • తెలంగాణలో పుంజకునేందుకు టీడీపీ ప్రయత్నాలు
  • కాసాని ఆధ్వర్యంలో ముమ్మర కార్యాచరణ
  • రేపు కరీంనగర్ లో టీడీపీ సభ
  • త్వరలోనే తెలంగాణలో టీడీపీ బస్సు యాత్ర
తెలంగాణలో మళ్లీ బలం పుంజుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవల ఖమ్మంలో చంద్రబాబు సభకు భారీ స్పందన రావడం తెలంగాణ టీడీపీ వర్గాల్లో ఉత్సాహం కలిగించింది. ఈ క్రమంలో, రేపు (ఏప్రిల్ 12) కరీంనగర్ లో టీడీపీ సభ నిర్వహించనుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో పలు పార్టీలకు చెందిన నేతలు పసుపు కండువాలు ధరించనున్నారు. 

ఈ సభ నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఇంటింటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లామని, త్వరలోనే తెలంగాణలో బస్సు యాత్ర చేపడతామని వెల్లడించారు. పాత, కొత్త క్యాడర్ అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని చెప్పారు. త్వరలో తెలంగాణ టీడీపీలో ముఖ్య నాయకుల చేరికలు ఉంటాయని కాసాని తెలిపారు. అన్ని జిల్లాల్లో సమావేశాలు అయ్యాక, పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ ఉంటుందని పేర్కొన్నారు.
Kasani Jnaneshwar
TDP
Telangana

More Telugu News