UK: మద్యానికి బానిసైన కుక్కకు ట్రీట్‌మెంట్.. ప్రపంచంలోనే తొలికేసు

Alcoholic UK dog which got addicted to drinks before sleeping is now sober after treatment

  • బ్రిటన్‌‌లో వెలుగు చూసిన అరుదైన కేసు
  • పెంపుడు కుక్కకు మద్యం అలవాటు చేసిన యజమాని
  • మద్యానికి బానిసైన కుక్క, యజమాని మరణంతో అనారోగ్యం పాలు
  • వైద్యుల చికిత్సతో కుక్క పూర్తిగా కోలుకున్న వైనం

మద్యానికి బానిసైన పెంపుడు కుక్క ఇటీవలే ఆ వ్యసనం నుంచి బయటపడిన ఉదంతం బ్రిటన్‌లో వెలుగు చూసింది. ప్లిమొత్ ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడు కుక్కకు కూడా మద్యం పోయడంతో అది కూడా అలవాటు పడిపోయింది. యజమాని మరణించాక శునకం తీవ్ర అనారోగ్యం పాలైంది. ఇది గమనించిన స్థానికులు.. కుక్కను జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ కుక్కకు తరచూ ఫిట్స్ వచ్చేవి. అనేక ఇతర సమస్యలతోనూ సతమతమయ్యేది. ఈ రోగ లక్షణాలను పరిశీలించిన వైద్యులు అది మద్యానికి బానిసైందని గుర్తించి చికిత్స ప్రారంభించారు. ఇటీవలే అది కోలుకుంది. అయితే.. ఓ కుక్క మద్యానికి బానిసై కోలుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.

UK
  • Loading...

More Telugu News