Andhra Pradesh: గుడ్ న్యూస్.. బంగారం ధరల తగ్గుముఖం

Gold prices see reduction in telugu states
  • అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ ధరల్లో తగ్గుదల
  • బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అంటున్న నిపుణులు 
  • తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 55,400
  • 24 వేల క్యారెట్ల బంగారం ధర రూ. 60430
పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. ఇటీవల గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇదే సరయిన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.390లు తగ్గి రూ.55,400కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 60430కు తగ్గింది. గత నాలుగు రోజుల్లో మేలిమి బంగారం ధర రూ.490 మేర తగ్గింది.
Andhra Pradesh
Telangana

More Telugu News