Nara Lokesh: లోకేశ్‌కు పత్తికొండ ఎమ్మెల్యే ఛాలెంజ్

Patthikonda MLA Sridevi challenges Lokesh to prove his allegations
  • ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న లోకేశ్ యువగళం పాదయాత్ర
  • పాదయాత్రలో లోకేశ్ ఆరోపణలపై స్పందించిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి
  • చేసిన ఆరోపణలు రుజువు చేసుకోవాలని లోకేశ్‌కు సవాల్
  • నోరు అదుపులో లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ వార్నింగ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీలో రాజకీయకాక రేపుతోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ లోకేశ్ దూకుడు ప్రదర్శిస్తుంటే..అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా తగ్గేదే లేదంటూ ప్రతిదాడికి దిగుతున్నారు. ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న లోకేశ్‌కు తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సవాలు విసిరారు. ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేశారు. పాదయాత్రకు వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలను ప్రజల ముందు చులకన చేయాలని చూస్తే ఎమ్మెల్యేలంతా కలిసి లోకేశ్ ఇంటిముందు కూర్చుని నిరసన తెలుపుతామని హెచ్చరించారు. 
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News