Firing: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఐదుగురి మృతి

  • లూయిస్ విల్లేలో కాల్పులకు పాల్పడిన దుండగుడు
  • బ్యాంకు ఎదుట ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు
  • పోలీసు అధికారి సహా ఆరుగురికి గాయాలు
  • బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది కాల్పుల్లో దుండగుడి మృతి
Five dead in mass shooting in US

అమెరికాలో విచ్చలవిడి కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓ బ్యాంకు ఎదుట ప్రజలను లక్ష్యంగా చేసుకుని గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. 

కాగా, ఈ కాల్పులతో బ్యాంకు భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, దుండగుడిపై కాల్పులు జరిపారు. దాంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇది ఉగ్రవాద చర్య అయ్యుండదని పోలీసులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సంఘటన స్థలి పూర్తిగా పోలీసుల అధీనంలో ఉంది. 

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న ఎఫ్ బీఐ, ఏటీఎఫ్ బృందాలు ఘటన స్థలికి చేరుకుని పరిశీలన చేపట్టాయి. దుండగుడు కాల్పులు ఎందుకు జరిపాడన్నది ఇంకా తెలియరాలేదు.

More Telugu News