Revanth Reddy: కేసీఆర్ భూదోపిడీపై ఇక రోజుకో ఎపిసోడ్: రేవంత్ రెడ్డి

Revanth Reddy take a swipe at CM KCR
  • కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్న రేవంత్
  • అందుకే పార్టీలతో బేరసారాలు సాగిస్తున్నారని వెల్లడి
  • కేసీఆర్ వంటి గజదొంగతో కాంగ్రెస్ పార్టీ కలవదని స్పష్టీకరణ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకోసమే పార్టీల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానం అని పేర్కొన్నారు. కేసీఆర్ గజదొంగ అని, ఆయనతో కాంగ్రెస్ పార్టీ కలవదని స్పష్టం చేశారు. 

కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ భూదోపిడీని ఓ టీవీ సీరియల్ లాగా బయటపెడతానని తెలిపారు. రేపు యశోద హాస్పిటల్స్ కు భూకేటాయింపుల్లో దోపిడీ కోణం ఎపిసోడ్ బయటపెడతానని వెల్లడించారు. కరోనా చికిత్స ఔషధం రెమ్ డెసివిర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Revanth Reddy
KCR
Congress
BRS
Telangana

More Telugu News