Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా ఆరో సెషన్ లో లాభపడ్డ మార్కెట్లు
  • 14 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని స్వల్ప లాభాలతో ప్రారంభించాయి. మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ ను లాభాలతో ముగించాయి. అన్ని సెక్టార్లలో ముఖ్యంగా రియలెస్టేట్ సెక్టార్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 59,847కి చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,624 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (5.37%), విప్రో (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.71%), ఎల్ అండ్ టీ (1.51%), ఎం అండ్ ఎం (1.46%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.37%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.73%).

More Telugu News