Gujarat Titans: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... కోల్ కతాపై టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans won the toss and elected batting first
  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
  • స్వల్ప అస్వస్థతతో మ్యాచ్ కు దూరమైన హార్దిక్ పాండ్యా
  • హార్దిక్ స్థానంలో గుజరాత్ కెప్టెన్ గా రషీద్ ఖాన్
ఆదివారం సందర్భంగా ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

కాగా, స్వల్ప అస్వస్థతతో ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కావడంతో, అతడి స్థానంలో గుజరాత్ టైటాన్స్ కు రషీద్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ స్థానంలో విజయ్ శంకర్ తుదిజట్టులోకి వచ్చాడు. 

గుజరాత్ టైటాన్స్ జట్టు టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో నెగ్గి మాంచి ఊపు మీద ఉండగా... కోల్ కతా రెండు మ్యాచ్ లు ఆడి, ఒకదాంట్లో విజయం సాధించింది. అయితే గత మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం కోల్ కతా నైట్ రైడర్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది.
Gujarat Titans
KKR
Toss
IPL

More Telugu News