Delh Capitals: వార్నర్ పోరు వృథా... ఢిల్లీ క్యాపిటల్స్ కు హ్యాట్రిక్ ఓటమి

  • ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు వరుసగా మూడో ఓటమి
  • నేడు రాజస్థాన్ చేతిలో 57 పరుగుల తేడాతో పరాజయం
  • 200 రన్స్ లక్ష్యఛేదనలో 9 వికెట్లకు 142 పరుగులే చేసిన ఢిల్లీ
  • 65 పరుగులు చేసిన కెప్టెన్ వార్నర్
Delhi Capitals bags third defeat in a row

ఐపీఎల్-16లో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయ పరంపర కొనసాగుతోంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ విసిరిన 200 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసింది. 

కెప్టెన్ డేవిడ్ వార్నర్ (55 బంతుల్లో 65) పోరాడినా ఫలితం దక్కలేదు. లలిత్ యాదవ్ (38) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్ మన్లలో ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. 

పృథ్వీ షా (0), మనీశ్ పాండే (0), రిలీ రూసో (14), అక్షర్ పటేల్ (2), రోవ్ మాన్ పావెల్ (2), వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (7) దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. కాగా, ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది వరుసగా మూడో ఓటమి. 


ఐపీఎల్-16లో సిసలైన పోరు... ముంబయి ఇండియన్స్ × చెన్నై సూపర్ కింగ్స్ 

ఐపీఎల్ తాజా సీజన్ లో రెండు దిగ్గజ జట్లు తలపడుతుంటే ఆ మజాయే వేరు. నేడు డబుల్ హెడర్ లో భాగంగా, రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదిక. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 21 పరుగులకు అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 14 పరుగులతో, కామెరాన్ గ్రీన్ పరుగులేమీ లేకుండా ఆడుతున్నారు.

More Telugu News