Bandi Sanjay: కేసీఆర్ కోసం చాలా సేపు వెయిట్ చేశాను: బండి సంజయ్

Waited for KCR for a long time says Bandi Sanjay
  • ప్రధాని హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదన్న సంజయ్
  • ఈరోజు ఆయన షెడ్యూల్ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్
  • కేసీఆర్ కోసం శాలువా కూడా తీసుకొచ్చానని వ్యాఖ్య
ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తే ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ప్రతి రోజు ఆరోపించే కేసీఆర్... ఇప్పుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ కు అవసరం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. 

అసలు ఈరోజు కేసీఆర్ ఏం చేశారో, ఆయన షెడ్యూల్ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కోసం తాను చాలా సేపు ఎదురు చూశానని చెప్పారు. ఆయన వస్తే సన్మానం చేద్దామని శాలువా కూడా తీసుకొచ్చానని అన్నారు. 

మరోవైపు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తూ కేసీఆర్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని... భారీ అవినీతి చోటు చేసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రానికి కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలని చెప్పారు.
Bandi Sanjay
Narendra Modi
BJP
kcr
BRS

More Telugu News